మనప్రజాప్రతినిధి//అక్బర్పేట-భూపల్లిడిసెంబర్10 మండలం,దుబ్బాకనియోజకవర్గం.సిద్దిపేట జిల్లా
నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న కాటికే లక్ష్మి అశోక్‌కు గ్రామ ప్రజలు ఆశీర్వాదం చేయాలని అక్బర్పేట మండల పరిధిలో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది.బుధవారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆమె, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా అభ్యర్థి కాటికే లక్ష్మి అశోక్ మాట్లాడుతూ“బీద అయిన నేను… ప్రజల సేవ తప్ప మరో ఆశ లేదు. ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాను” అని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తనకు మద్దతు ఇస్తున్నారని, ఆయన సహకారంతో నగరం గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా మార్చి చూపిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ, ప్రభుత్వం అందించే నిధులతో మరింత అభివృద్ధి పనులు చేపడతానని స్పష్టం చేశారు.“గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబా టులో ఉంటాను… ప్రజల సమస్యలు నా సమస్యల్లా భావించి పరిష్క రిస్తాను” అని వెల్లడించారు.రాజకీయాల్లో స్వార్థం కోసం కాకుండా, సేవ కోసం అడుగుపెట్టానని, వివిధ రంగాల్లో సేవ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.అభ్యర్థి లక్ష్మి అశోక్ మాట్లాడుతూ “మీ అమూల్యమైన ఓటు నా శక్తి. కాంగ్రెస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి సాధించాయి. నన్ను గెలిపిస్తే నగరం గ్రామాన్నిఅన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తాను” అని పేర్కొన్నారు.గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే,అభివృద్ధి-సేవ-పారదర్శకత ఆధారంగా పనిచేస్తానని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ బలపరిచిన నగరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాటికే లక్ష్మిఅశోక్‌కి ప్రజా ఆశీర్వాదం కావాలి
RELATED ARTICLES

