Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుగురుకులాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం-విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

గురుకులాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం-విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

📰 Generate e-Paper Clip

ఆహార విషబాధలపై ప్రభుత్వ మౌనం నేరమే: కంచర్ల రవి గౌడ్
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్20
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు వరుసగా ఆహార విషబాధకు గురై ఆసుపత్రుల పాలవుతుంటే, ప్రభుత్వం మాత్రం కళ్లుమూసుకుని చూస్తోందని బిఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవి గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.శనివారం సిరిసిల్ల పట్టణంలోని చేనేత చౌక్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూగురుకులాల్లో జరుగుతున్న ఘటనలు యాదృచ్ఛికమైనవి కావని, వ్యవస్థాగత నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఒక్క సమగ్ర సమీక్ష కూడా జరగకపోవడం, బాధ్యులపై చర్యలు లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని బయటపెడుతోందన్నారు.
గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులంతా పేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లలేనని, అలాంటి పిల్లల ఆరోగ్యం, భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల ప్రాణాలకంటే రాజకీయాలే ముఖ్యమన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావృతం అవుతున్నాయో విచారణ చేయకపోవడం ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. నేడు గురుకులాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడిందంటే, దానికి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular