మునిపల్లి,డిసెంబర్20(మనప్రజాప్రతినిధి)
మునిపల్లి మండలంలో పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్ శిక్షణ శ్రీ పీ. ప్రతిభా శేఖర్ అధికారులకు సూచించారు.ఈ మేరకు శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ పాలన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భూభారతి సంబంధిత దరఖాస్తులను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) ద్వారా సమయానికి నివేదికలు సమర్పించాలన్నారు.ప్రతి రెవెన్యూ గ్రామంలో రైతులకు అధికారులు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. భూమి సంబంధిత సమస్యలపై రైతులు ఇబ్బందులు పడకుండా సత్వర సేవలు అందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో స్థానిక తహసిల్దార్ గంగాభవాని, డిప్యూటీ తహసిల్దార్ మర్రి ప్రదీప్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుభాష్, గ్రామ పాలన అధికారులు అంజన్ కుమార్ యాదవ్, చంద్రప్రకాష్, నర్సింలు, శివగౌడ్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి :డిప్యూటీ కలెక్టర్ శిక్షణ
RELATED ARTICLES

