Wednesday, March 11, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్“అంధుడైనా… అద్భుతమే!హర్షవర్ధన్‌ను సత్కరించినఎమ్మెల్యేబొజ్జల”

“అంధుడైనా… అద్భుతమే!హర్షవర్ధన్‌ను సత్కరించినఎమ్మెల్యేబొజ్జల”

📰 Generate e-Paper Clip

హర్షవర్ధన్‌కు స్వాగతం పలికి సన్మానించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలండిసెంబర్9.

స్కేటింగ్‌లో అసాధారణ ప్రతిభచూపిన 10 సంవత్సరాల అంధ బాలుడు హర్షవర్ధన్‌ను ప్రశంసిస్తూ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
“శ్రీకాళహస్తి వాసి అయినందుకు గర్వంగా ఉంది” అని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.హర్షవర్ధన్‌కు ₹20,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ గారితో కల్పించబ్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.
నంగిలి నుంచి శ్రీకాళహస్తి వరకు 220 కిలోమీటర్ల స్కేటింగ్ ప్రయాణంను ప్రారంభించి, విజయవంతంగా శ్రీకాళహస్తి చేరుకున్న హర్షవర్ధన్‌ను అభినందిస్తూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడారు.“సంకల్పం ఉన్నవారికి ఎలాంటి అడ్డూ ఉండదు… హర్షవర్ధన్ అందుకు నిలువెత్తు నిదర్శనం” అని ఆయన ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular