ప్రజల తీర్పుతో సత్తా చాటిన ఘనపురం కృష్ణ
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లాడిసెంబర్14
సిద్దిపేట జిల్లా రూరల్ మండలంలోని ఇర్కోడ్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 495 ఓట్ల భారీ మెజారిటీతో ఘనపురం కృష్ణ ఘనవిజయంసాధించారు. గ్రామ ఉపసర్పంచ్ గా బొప్పిడి రాజవ్వ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 1816 ఓట్లు పోలింగ్ జరగగా, ప్రజల అపారవిశ్వాసంతో ఆయన విజేతగా నిలిచారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మద్దతుదారులు బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరిపారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఘనపురం కృష్ణ మాట్లాడుతూ,“నాపై విశ్వాసంతో నన్ను గెలిపించిన ప్రతి గ్రామస్థుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా, విడతల వారీగా అమలు చేస్తాను. గ్రామ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం” అని భరోసా ఇచ్చారు.
అభ్యర్థుల ఓట్ల జాబితా
క్రమ సంఖ్య అభ్యర్థి పేరు పొందిన ఓట్లు
1 ఘనపురం కృష్ణ 1092
2 మాట్ల లింగం 597
3 ఘనపురం (దుబ్బాక) చంద్రమౌళి 38
4 బొర్ర భానుప్రసాద్ 21
5 చెప్యాల యాదగిరి 15
6 గుట్ట కింది రాజు 21
7 చెల్లనివి 29 .8 నోటా=3
మొత్తం పోలింగ్ ఓట్లు : 1816
మెజారిటీ : 495 ఓట్లు

