Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలు“మన్ కీ బాత్” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బి.బి. పాటిల్

“మన్ కీ బాత్” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బి.బి. పాటిల్

📰 Generate e-Paper Clip


రైతుల కోసం ఉపాధి హామీ పథకం 125 రోజులకు పొడిగింపు-మోడీ ప్రభుత్వ నిర్ణయం ప్రశంసనీయం
సదాశివపేట,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి):
భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచంద్రరావు పిలుపు మేరకు, కిసాన్ మోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి, జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎంపీ బి.బి. పాటిల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ బి.బి. పాటిల్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పథకాన్ని 125 రోజులకు పొడిగించారని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా రైతు కూలీలకు ఎక్కువ రోజుల ఉపాధి లభించి, వారి ఆర్థిక స్థిరత్వానికి బలమవుతుందని తెలిపారు.అలాగే, పనిచేసిన వారం రోజుల్లోనే కూలీల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన విధానాన్ని అమలు చేస్తోందని చెప్పారు. భారత ప్రభుత్వం అన్ని విధాలుగా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందని, భవిష్యత్తులో రైతులకు మరింత మేలు చేకూర్చే పథకాలుఅమలులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి, శ్రీ రాజేశ్వరరావు దేశ్‌పాండే, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదెల్లి రవీందర్, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పోచారం రాములు, మండల నాయకులు, జిల్లా నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular