మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్ 28
కొండపాక మండలంలోని సిరిసినగండ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి (45) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. గత 15 రోజులుగా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
లక్ష్మారెడ్డి మరణవార్త తెలుసుకున్న వెంటనే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం నిర్వహించిన అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు చివరి నివాళులు అర్పించారు.
అనారోగ్యంతో మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి మృతి
RELATED ARTICLES

