సిపిఐ పార్టీ డిమాండ్
సంగారెడ్డి,డిసెంబర్23(మనప్రజాప్రతినిధి)
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంగారెడ్డి చౌరస్తాలోని వెల్నెస్ ప్రైవేట్ ఆసుపత్రిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏవో ఆంథోనీ డయాన్సీయో గారికి సిపిఐ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.ఏ. రెహమాన్ మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులు 24 గంటల సేవలు అందిస్తామని ప్రజలను నమ్మించి అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన రోగుల నుండి టెస్టుల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్ పేరుతో లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకుంటూ, ఆసుపత్రిలో సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లను ఆలస్యంగా తెప్పించి చికిత్స ప్రారంభిస్తున్నారని తెలిపారు.వైద్యులు సమయానికి రాకపోవడం వల్ల పలువురు రోగుల పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెల్నెస్ ఆసుపత్రిలో అనేకసార్లు చోటు చేసుకున్నాయని, దీనిపై ప్రశ్నించిన రోగుల కుటుంబ సభ్యులపై రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఇచ్చే లంచాలకు అలవాటు పడి చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా ఆసుపత్రుల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులను దేవుళ్లుగా భావించే సమాజంలో కొంతమంది వైద్యులు మాత్రం రోగులను డబ్బులు సంపాదించే యంత్రాలుగా చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని వెల్నెస్ ఆసుపత్రితో పాటు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, తప్పిదాలు చేసిన వారిపై ప్రభుత్వపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వం, అధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వెంకటరాజ్యం, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, పాడి రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, శివ శంకర్, లక్ష్మణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వెల్నెస్ హాస్పిటల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలి
RELATED ARTICLES

