Sunday, March 8, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఖాజీపూర్ అభివృద్ధికి కాపర్ల బాల లక్ష్మి చిరంజీవిసంకల్పం

ఖాజీపూర్ అభివృద్ధికి కాపర్ల బాల లక్ష్మి చిరంజీవిసంకల్పం

📰 Generate e-Paper Clip

బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి – ప్రజలకు విజ్ఞప్తి

మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట్ భూంపల్లి మండల్,దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాడిసెంబర్11

అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామం సర్పంచ్ అభ్యర్థి కాపర్ల బాల లక్ష్మి చిరంజీవి, గ్రామ ప్రజలను కలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని ప్రజలను కోరారు.
గురువారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ,
“ఖాజీపూర్ గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా. ప్రతి ఇంటి సమస్య నా సమస్యే. అందరికీ అందుబాటులో ఉంటూ ఖాజీపూర్‌ను అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తా” అని చిరంజీవి తెలిపారు.
“అభివృద్ధి లక్ష్యమే… ప్రజల నమ్మకమే నాకు బలం” కాపర్ల బాల లక్ష్మి చిరంజీవి
అభ్యర్థి చిరంజీవి ఇంకా మాట్లాడుతూ● గ్రామ సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం
● ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజల దాకా తీసుకెళ్లడం
● పారదర్శక పాలన – ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో
● మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
● గ్రామ శుభ్రత, రోడ్లు, డ్రైనేజీలు, పబ్లిక్ సౌకర్యాల మెరుగుదల
● విద్యార్థులకు ప్రోత్సాహం – పేదలకు చేయూత
“దుబ్బాక నియోజకవర్గ ప్రజల సహకారంతో ఖాజీపూర్ గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలబెడతా. మీ ఒక్కో ఓటు నాకు శక్తి, గ్రామానికి భవిష్యత్తు. అందరూ మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటు న్నాను” అని కాపర్ల బాల లక్ష్మి చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular