మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//.శివయిపల్లి.డిసెంబర్9శివయిపల్లి గ్రామ 6వ వార్డు నుండి మెంబర్ పదవికి కొత్తపల్లి ప్రభాకర్ నేడు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ“నా వార్డు ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పదవి కోసం నన్ను ముందుకు తీసుకువచ్చి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉండాను.6వ వార్డు అభివృద్ధి కోసం రాత్రి పగలు అన్న భావన లేకుండా అహర్నిశలు కష్టపడి పని చేస్తాను. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా మొదటి లక్ష్యం. దయచేసి ఈ ఎన్నికల్లో నన్ను, కొత్తపల్లి ప్రభాకర్‌ను గెలిపించి ఆశీర్వదించండి. వచ్చే 5 సంవత్సరాలు మీ సేవ కోసం అంకితభావంతో పనిచేస్తాను” అని తెలిపారు.ప్రభాకర్ నామినే షన్ దాఖలు కార్యక్రమానికి స్థానికులు హాజరై ఆయనకు తమ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
Homeతెలంగాణజిల్లా వార్తలుకొత్తపల్లి ప్రభాకర్ నామినేషన్ దాఖలు6వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపిన ప్రభాకర్
కొత్తపల్లి ప్రభాకర్ నామినేషన్ దాఖలు
6వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపిన ప్రభాకర్
0
11
Previous article

