మెదక్ జిల్లా..మనప్రజాప్రతినిధి//రామయంపేట్ మండలం.ఝాన్సీ లింగాపూర్ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి మనేగల రామకిష్టయ్య తెలిపారు. మెదక్ మండల కేంద్రంలో సర్పంచ్ పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు.ఈసందర్భంగా రామకిష్టయ్య మాట్లాడుతూ“గ్రామ ప్రజలంతా పుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే, ప్రతి ఒక్కరికీ అందు బాటులోఉంటూ గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని నిరంతరం పనిచేస్తాను. ప్రభుత్వ పథకాలన్నింటిని ప్రజలకు చేరవేసి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను” అని అన్నారు.అలాగే గ్రామ అభివృద్ధి కోసం తనదైన విధంగా సేవ చేస్తానని, ప్రతి ఇంటా సహకారం అందించాలని, బ్యాలెట్ పేపర్లో క్రమ సంఖ్య 4 పుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని రామకిష్టయ్య గ్రామ ప్రజలను కోరారు.
ఝాన్సీ లింగాపూర్ అభివృద్ధికి నన్ను గెలిపించండి : మనేగల రామకిష్టయ్య
0
6

