మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 12
మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం, సోమరం పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి భారతమ్మ–లక్ష్మారెడ్డి కు ప్రజా మద్దతు తెలపాలని మనకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఉంగరం గుర్తుకు ఓటువేసి విశాలమైన మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ,గ్రామాల అభివృద్ధి-సంక్షేమం -ప్రజా పాలన అమలు కాని పునాది సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి–సంక్షేమ పథకాలు గ్రామాలకు చేరాలంటే పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు.కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల్లో
• అభివృద్ధి పనులు వేగవంతం,
• సంక్షేమ పథకాల విస్తరణ,
• ప్రజా సమస్యలకు త్వరిత పరిష్కారం
లభిస్తాయని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలోమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి,మాజీ ఎంపీపీలు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి,మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి,గ్రామ శాఖ అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

