యువజన సంఘాల ఆధ్వర్యంలో యూత్ సభ్యుల ఏకగ్రీవ మద్దతు
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్11
ఇల్లంతకుంట మండలకేంద్రంలో యువజన సంఘాల అధ్యక్షులు ఉప్పల అమరేందర్ ఆధ్వర్యంలో యూత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు, యువ నాయకుడు, సర్పంచ్ అభ్యర్థి మామిడి రాజుకు ఏకగ్రీవంగా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు అన్ని యువజన సంఘాల సభ్యులు తెలిపా రు.ఈ సందర్భంలో యూత్ నాయకులు“మామిడి రాజు గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారన్న విశ్వాసంతో మేమంతా ఆయనకు అండగా, మద్దతుగా నిలుస్తున్నాం” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మామిడి రాజు మాట్లాడుతూ“నాపై నమ్మకం ఉంచి నన్ను మద్దతు ఇస్తున్న యువజన సంఘాలు, యూత్ సభ్యులందరికీ శిరసు వంచి నమస్కారం.మీ ఆశీస్సులతో గ్రామాభివృద్ధి దిశగా కృషి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను ”అన్నారు.అలాగే ఆయన గ్రామప్రజలనుఅభ్యర్థిస్తూ“గ్రామ ప్రజలు కూడా నాపై నమ్మకం ఉంచి కత్తెర ✂️ గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను” అనితెలిపారు.

