Saturday, March 14, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ఇంటింటా పోలియో చుక్కలు: ఏర్పేడు మండలంలో సంపూర్ణ స్పందన

ఇంటింటా పోలియో చుక్కలు: ఏర్పేడు మండలంలో సంపూర్ణ స్పందన

📰 Generate e-Paper Clip

పోలియో రహిత సమాజం లక్ష్యంగా ఏర్పేడు పీహెచ్‌సీ ముందడుగు
•ఆశా-అంగన్వాడీ సిబ్బంది సమిష్టి కృషితో పోలియో కార్యక్రమం విజయవంతం.పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఏర్పేడు పీహెచ్‌సీ సిబ్బంది
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్ 21
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమం ఘన విజయం సాధించింది.చుట్టుపక్కల గ్రామాల నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలను తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించగా, ప్రజల్లో ఆరోగ్యంపై ఉన్న అవగాహన స్పష్టంగా కనిపించింది.అదేవిధంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు ప్రతి గ్రామానికి వెళ్లి ఇంటింటా తిరుగుతూ పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో జయప్రదం చేశారు.ఈ కార్యక్రమానికి ఏర్పేడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి. శివప్రియ, డాక్టర్ లావణ్య సమర్థ నాయకత్వం వహించగా, పీహెచ్‌సీ సిబ్బంది సమిష్టి కృషితో పోలియో నిర్మూలన దిశగా మరో ముందడుగు పడింది.పిల్లల భవిష్యత్తును కాపాడే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్ల సేవలు ప్రశంసనీయం అని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular