Sunday, March 15, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రజల పాలనకు ప్రజా మద్దతు.నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం

ప్రజల పాలనకు ప్రజా మద్దతు.నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్25
కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మిద్దె శివకుమార్‌, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరి, వార్డు మెంబర్ కొమ్ము కవిత స్వామికి మాదిగ ప్రైవేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పల్లె భూపతి రాజు మాట్లాడుతూ, ప్రజల ఆశయాలతో అధికారంలోకి వచ్చిన నూతన ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని పాలన సాగించాలని సూచించారు. ప్రతి వర్గానికీ సమ న్యాయం అందేలా పనిచేసి, మౌలిక వసతుల కల్పనతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు.
ప్రజల విశ్వాసంతో బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ మిద్దె శివకుమార్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాదిగ ప్రైవేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పల్లె స్వామి, ఉపాధ్యక్షులు కొమ్ము నరేష్, కోశాధికారి సంపత్ రాజశేఖర్‌తో పాటు సభ్యులు బాకీ రాజు, అరుణ్ కుమార్, బిక్షపతి, నర్సింలు, కృష్ణంరాజు, రాంపురం రాజు, కోడూరు రాజు, పల్లె రాజు, లక్ష్మి, నవనీత, శారద, మంజుల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular