Saturday, March 7, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుపులిమామిడి సర్పంచ్ అభ్యర్థి యమ్మాజీ నర్సాగౌడ్ అభివృద్ధి సంకల్పాలు ప్రకటింపు

పులిమామిడి సర్పంచ్ అభ్యర్థి యమ్మాజీ నర్సాగౌడ్ అభివృద్ధి సంకల్పాలు ప్రకటింపు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//చేగుంట మండలం.దుబ్బాక నియోజకవర్గం మెదక్ జిల్లా.డిసెంబర్12
చేగుంట మండల పరిధిలోని పులిమామిడి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగిన యమ్మాజీ నర్సాగౌడ్ గ్రామ అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సేవలను ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. గ్రామ ప్రజలతో సమావేశమై తమ 12 ముఖ్య సంకల్పాలను వివరించారు.
పారదర్శక పాలన – ప్రజలకు నిరంతరం అందుబాటు
నర్సాగౌడ్ మాట్లాడుతూ పారదర్శక సుపరిపాలన, ప్రతి నెల గ్రామసభ నిర్వహణ, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు.అభివృద్ధికి సంబంధించిన 12 సంకల్పాలు
1) సుపరిపాలన• గ్రామసభలు నిర్వహణ• ప్రజా సమస్యల శీఘ్ర పరిష్కారం2) నల్లాబిల్లు మాఫీ3) విద్యా రంగ అభివృద్ధి• పులిమా మిడి స్కూల్‌కు ప్రహరీ గోడ• క్రీడా ప్రాంగణం• విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ4) సాంఘిక భద్రత• మరణించిన కుటుంబాలకు ₹2,000 సహాయం• నిరుపేద పెళ్లిళ్లకు ₹5,000 సాయం5) గ్రామ మౌలిక సదుపాయా లు• కొత్త గ్రామపంచాయతీ కార్యాలయం• దేవాలయాల అభివృద్ధి6) రైతు సంక్షేమం• ప్రత్యేక రైతు కమిటీ• ప్రతి నెలా అవగాహన సదస్సు లు• నూతన పంటలు, వంగడాల వాడకం పై శిక్షణ7) యువత అభివృద్ధి• క్రీడా సామాగ్రి పంపిణీ• ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగావకా శాల రూపకల్పన• లైబ్రరీ భవన నిర్మాణం8) వైద్య సేవలు• ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరం• ఉచిత మందుల పంపిణీ9) పట్టాల సమస్యల పరిష్కారం• ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం10) పాథ నీటి ట్యాంకుల మరమ్మతులు• ప్లాస్టిక్ రహిత గ్రామ ఏర్పాటు11) గ్రామ పారిశుధ్యం• రోడ్ల మరమ్మతులు• చెత్త వ్యర్థాల సుద్దీకరణ12) విద్యార్థులకు ప్రోత్సాహం• ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక చేయూత• విద్యారంగానికి పెద్దపీట టీ వి రిమోట్ గుర్తుకు ఓటు కోరిన నర్సాగౌడ్  అభ్యర్థిస్తూ“టీ వి రిమోట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించి ఆశీర్వదించండి. పులిమామిడి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాను” అని యమ్మాజీ నర్సాగౌడ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular