Thursday, March 12, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుసర్పంచ్ అభ్యర్థి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి

సర్పంచ్ అభ్యర్థి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 05
వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రజాసేవ పట్ల అంకితభావంతో, ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీఆర్‌ఎస్ మద్దతుదారుడు చెర్ల మురళి (సర్పంచ్ అభ్యర్థి) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు.ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూ, గ్రామాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్న మురళి, నిన్నటి వరకు గ్రామం అంతా తిరుగుతూ ఓటర్లను కలిశారు. ప్రజాసేవ చేయాలనే తపనతో ఎన్నో కలలతో ముందుకు సాగుతున్న సమయంలో, ఆకస్మిక హృద్రోగంతో ఆయన అర్థాంతరంగా కన్నుమూయడం గ్రామస్తులను శోకసంద్రంలో ముంచెత్తింది.గ్రామంలో విషాద ఛాయలుఅలుముకుని, మురళి మృతి పట్ల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు లోతైన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular