•ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజు స్పష్టం మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 26
శ్రీ కృష్ణ గోశాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి ఘనంగా సన్మానం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ అయ్యన్నగారి హరికృష్ణా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మామిడి రాజు, ఉపసర్పంచ్ మూగ నాగరాజు శర్మతో పాటు వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ..“ముప్పయి మూడు వేలకోట్ల దేవతలకు నిలయమైన గోమాతల సమక్షంలో సన్మానం జరగడం నా అదృష్టం. గోశాల అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం” అని హామీ ఇచ్చారు.ఉపసర్పంచ్ నాగరాజు శర్మ మాట్లాడుతూ సృష్టిలో మూడు మాతలు అత్యంత ముఖ్యమని, భూమాత, గోమాత, మనకు జన్మనిచ్చిన తల్లి లేనిదే సృష్టి లేదన్నారు.ట్రస్ట్ చైర్మన్ హరికృష్ణా రెడ్డి మాట్లాడుతూ గోసేవ చేయడం పూర్వజన్మ సుకృతమని, గోమాత సేవ అత్యంత శ్రేష్టమని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో గోవుల పాత్ర అమోఘమని పేర్కొన్నారు. పూర్వీకులు మనకు అందించిన గోవుల ఆధారంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
మాజీ సర్పంచ్ కూనబోయిన బాలరాజు మాట్లాడుతూ గోవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు నార్ల రాంకిషన్, బోనగిరి రాము, నారెడ్డి, కిషోర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కేసరి కనకయ్య, చిట్టి ప్రదీప్ రెడ్డి, మంద చక్రధర్ రెడ్డి, వార్డు సభ్యులు రేగుల కార్తీక్, సుమన్, మామిడి శ్రీను, దీపిక రవితేజ, దయ్యాల శ్రీలత, మహేష్, ప్రమీల, వెంకన్న, మామిడి సుశీల, చేరాల వంశీ, అంతం శ్రీకాంత్, గోసేవకులు మల్లేశం, కట్ట ఎల్లారెడ్డి, రాజస్థాన్ గణేష్, బత్తిని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గోసేవే పర్యావరణ పరిరక్షణకు మార్గం
RELATED ARTICLES

