మనప్రజాప్రతినిధి-ఏర్పేడు మండలం.డిసెంబర్ 25
ఏర్పేడు మండలంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన శ్రీ గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దేవస్థానం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అమరావతి సర్కిల్ సూపరింటెండెంట్ దేబేంద్రనాథ్ బోయి బాబు గారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనార్థం విచ్చేయడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బత్తల గిరిబాబు నాయుడు, కార్యనిర్వాహణాధికారి భక్తిశ్రద్ధలతో వారికి ఘన స్వాగతం పలికి, స్వామివారి తీర్థ–ప్రసాదాలు అందజేశారు.స్వామి వారి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో తీర్థప్రసాదాలు స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.
గుడిమల్లం పరశురామేశ్వర స్వామి సన్నిధిలో ఆర్కియాలజీ సూపరింటెండెంట్ కుటుంబ సమేత దర్శనం
RELATED ARTICLES

