Monday, March 2, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆపాలి

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆపాలి

📰 Generate e-Paper Clip

హిందూ మైనారిటీల రక్షణకు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
తిరుపతిలో హిందూ సంఘాల ఉగ్ర నిరసన
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.తిరుపతి,డిసెంబర్‌24:
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు, దేవాలయాల విధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తూ బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌ వేదికగా హిందూ సంఘాలు, ప్రజాప్రతినిధులు ఉగ్ర నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిందువులపై కొనసాగుతున్న అమానుష దాడులు ప్రపంచ మానవ హక్కుల వ్యవస్థపై ప్రశ్నార్థకంగా మారాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను క్రూరంగా హత్య చేయడం అత్యంత హేయమైన చర్యగా నిరసనకారులు పేర్కొన్నారు. ఈ ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా ఉందని, సనాతన ధర్మాన్ని మట్టుబెట్టే కుట్రగా వారు అభివర్ణించారు.
ఈ సందర్భంగా నాయకులు బత్తేన మధు బాబు, వెంకట్ రాయల్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందూ మైనారిటీలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఘాటుగా విమర్శించారు. హిందూ దేవాలయాలపై దాడులు, హిందువులపై జరుగుతున్న మారణకాండను భారత ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి అంతర్జాతీయ స్థాయిలో వెంటనే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, అక్కడ జరుగుతున్న అకృత్యాలు మానవ హక్కుల ఉల్లంఘనలకు నిదర్శనమని తెలిపారు. దీపు చంద్ర దాస్ హత్యకు బాధ్యులైన నిందితులకు అత్యంత కఠిన శిక్షలు విధించాలని, బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలకు, హిందూ దేవాలయాలకు పూర్తి భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. హింసను రెచ్చగొడుతున్న తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సనాతన ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడాలని వారు ప్రార్థించారు.
ఈ నిరసన కార్యక్రమంలో హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మధు బాబు, వెంకట్ రాయల్, హిమవంత్, కృష్ణ, మునిరామ్ రెడ్డి, సాయి, విశ్వ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular