Saturday, March 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుసదాశివపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్… పార్టీ ఆఫీసులో కీలక సమీక్ష సమావేశం

సదాశివపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్… పార్టీ ఆఫీసులో కీలక సమీక్ష సమావేశం

📰 Generate e-Paper Clip

సదాశిపేట.డిసెంబర్21(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా సదాశిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్ హాజరై దిశానిర్దేశం చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సదాశివపేట పట్టణంలోని 26 వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.18 కోట్ల 40 లక్షల విలువైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు తదితర అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తయ్యి, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు నేతలు వెల్లడించారు.అదేవిధంగా మిగిలిన అభివృద్ధి అవసరాలపై వార్డు ఇంచార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారా నివేదికలు సేకరించారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, విద్యుత్ స్తంభాలు, బోర్లు, మంచినీటి సమస్యలు, మైనార్టీ షాదీఖానాల అవసరాలపై వివరంగా చర్చించి, నిధుల కేటాయింపుకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా
1️⃣ ఉచిత విద్యుత్
2️⃣ రేషన్ కార్డులు
3️⃣ సన్నబియ్యం పంపిణీ
4️⃣ ఉచిత బస్సు ప్రయాణం
5️⃣ రైతు రుణమాఫీ
6️⃣ రూ.500 గ్యాస్ సబ్సిడీ
ఈ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, మాజీ బీసీ కార్పొరేషన్ సభ్యులు పట్నం సుభాష్, మాజీ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, మాజీ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజుగౌడ్, లక్ష్మీప్రసన్న, శంకర్ గౌడ్, గుండు రవికుమార్, రాయిపాటి రమేష్, సత్యనారాయణ, డైరెక్టర్లు రాములు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, వాజిద్, కళావతి, ఎండీ సాబీర్, గంగారం, స్వరూప, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు ఇంచార్జీలు మఠం వీరన్న, కౌలే విజయ్ కుమార్, ఎండీ లతీఫ్, రాఘవేందర్, నాగేష్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular