అనుమతి పత్రాలు మావద్ద లేవని లిఖితపూర్వకంగా తెలిపిన అధికారులుఆర్టీఐ సమాచారం ధృవీకరణ
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్4
సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ ప్రాంతంలో ఉన్న ఒక బంకెట్ హాల్‌కు సంబంధించిన ముఖ్యమైన అనుమతి పత్రాలు తమ వద్ద లేవని మున్సిపల్ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.
రగుడు గ్రామానికి చెందిన యువకుడు మహిపాల్, బంకెట్ హాల్ నిర్మాణం, అనుమతులపై వివరాలు కోరుతూ మున్సిపల్ కార్యాలయానికి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా, ఆర్టీఐకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అనుమతి దరఖాస్తు, లైసెన్స్ వివరాలు, భద్రతా ప్రమాణాల పత్రాలు తమ వద్ద లేవని అధికారులు స్పష్టం చేశారు.దీంతో బంకెట్ హాల్ ఎలా నడుస్తోంది? అనుమతులు లేకుండానే నిర్మాణం జరిగిందా? వంటి ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. టౌన్ ప్లానింగ్ విభాగం నిర్లక్ష్యం, అధికారులు కంచెచేను మేసినట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.స్థానిక ప్రజలు ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, అక్రమ నిర్మాణానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని నిజాలు వెలుగులోకి తేవాలని కోరుతున్నారు.
సిరిసిల్ల మున్సిపల్ అధికారుల లీలలు బట్టబయలు.
RELATED ARTICLES

