Saturday, March 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమొగుడంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం

మొగుడంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి,డిసెంబర్22(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బి. రాజు, ఉప సర్పంచ్ పి. సంజీవరెడ్డి, వార్డు సభ్యులు తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10:30 గంటలకు గ్రామపంచాయతీ కార్యదర్శి బి. మారుతి అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా
మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మక్సుద్,
మాజీ సర్పంచ్ పి. వెంకట్రాంరెడ్డి,బి. ప్రేమ్ కుమార్ కుల్కరిణి,
మాజీ జెడ్పిటిసి పి. విజయ మోహన్ రెడ్డి,మాజీ ఎంపిటిసి సి. శ్రీనివాస్, మొహమ్మద్ ఖాన్,మాజీ సర్పంచ్ సి. బక్కయ్య, ఆలూరు కిష్టన్న,మాజీ ఉపసర్పంచ్ బి. రాములు,శంకర్రావు కుల్కరిణి తదితరులు హాజరయ్యారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular