ఏర్పేడు ఎంపీపీ ఎన్నికలు ముగుంపు.టీడీపీ తెగింపు పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు పీ. ఆదిలక్ష్మి కొత్త ఎంపీపీ
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం,డిసెంబర్11
ఎర్పేడు మండలంలో నెలలుగా కొనసాగిన ఎంపీపీ రాజకీయ సందడి ఈ రోజు ముగిసింది. గీత రాజీనామా నేపథ్యంలో ఖాళీ అయిన ఎంపీపీ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వ్ కావడంతో పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు పీ. ఆదిలక్ష్మి ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకోబడ్డారు.ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ కోసం ఉదయం నుంచే ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మండలవ్యాప్తంగా ఉన్న 9 మంది ఎంపీటీసీలు కార్యాలయానికి చేరుకోగా, పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కార్యాలయ ప్రాంగణంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఎన్నికల హడావిడి మరింత పెరిగింది.రిజర్వేషన్ కారణంగా ప్రస్తుత ఎంపీటీసీల్లో ఎకైక ఎస్టీ మహిళగా ఉన్న ఆదిలక్ష్మి ఎంపీపీగా ఎంపిక కావడం ఖాయం అయ్యింది. అయితే ఆమెతో పాటు ఉన్న 9 మంది వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు కూడా టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై టిడిపి విధానాలకు బహిరంగ మద్దతు ప్రకటించారు.ఇకపోతే, ఎన్నికలకు హాజరుకాని 5 మంది వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు దూరంగా ఉండటం స్థానిక రాజకీయంగా చర్చనీయాంశ మైంది.ఈతరుణంలో ఏర్పేడు ఎంపీపీ కుర్చీ టిడిపి చేతుల్లోకి వెళ్లడం మండల రాజకీయాలకు కొత్త మలుపు తిప్పినట్లైంది.
ఏర్పేడు ఎంపీపీ కుర్చీ టిడిపిలోకి… పంగూరు ఆదిలక్ష్మికే తలపాగా!
RELATED ARTICLES

