మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేటభూంపల్లిమండలం,దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేట జిల్లా
అక్బర్‌పేట భూంపల్లి మండల పరిధిలోని పోతారెడ్డిపేట గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గీతా పారిశ్రమక సంఘం మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బండి నర్సా గౌడ్ సతీమణి బండి భాగ్యలక్ష్మి గారి దశదినకర్మ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై, బండి భాగ్యలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా స్వర్గీయ బండి నర్సా గౌడ్ కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలోఏఎంసీ చైర్మన్ బొమ్మేర సంయుక్త శ్రీధర్ నేషనల్ కాంగ్రెస్ వారియర్ జిల్లా అధ్యక్షులు గజిబింకర్ అశోక్,దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్,జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, నేషనల్ కాంగ్రెస్ వారియర్ జిల్లా అధ్యక్షులు గజాబింకర్ అశోక్,మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాల్ యాదవ్,మాజీ ఎంపీటీసీలు మంద చంద్రసాగర్, పాతూరి శ్రీనివాస్ గౌడ్,మాజీ సర్పంచులు పెరిక మధు, పోతారం అనసూయ ప్రతాప్,TPCC లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కొండల్ రెడ్డి,కిసాన్ సెల్ దుబ్బాక అధ్యక్షులు అందె రాజిరెడ్డి కూడవల్లి దేవస్థానం డైరెక్టర్ పుద్ధోజి ప్రభాకర్ చారి,ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఎర్రోళ్ల స్వప్న బాలు, సతీష్,ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బ్యాగరి నవీన్,ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు పల్లె అనిల్,సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి, బాల్తే వెంకటేశం, కోరంపల్లి యాదవరెడ్డి(రుద్రారం), దేవర మైపాల్, బొమ్మరపు ఎల్లం తదితరులు పాల్గొన్నారు.
బండి భాగ్యలక్ష్మి దశదినకర్మకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరు
RELATED ARTICLES

