Saturday, March 7, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలురాంపూర్‌ను ఆదర్శ గ్రామంగా మార్చుతా

రాంపూర్‌ను ఆదర్శ గ్రామంగా మార్చుతా

📰 Generate e-Paper Clip

సర్పంచ్ అభ్యర్థి కోడూరు మమత రాజు
ఉంగరం గుర్తుకు ఓటు వేయండి-సేవ చేసే అవకాశం ఇవ్వండి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా రూరల్.డిసెంబర్11
సిద్దిపేట మండల రూరల్ పరిధిలోని రాంపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోడూరు మమత రాజు గురువారం గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… “పాలకుడిని కాదు, సేవకుడిని ఎంచుకోండి” అని విజ్ఞప్తి చేశారు.గ్రామ అభివృద్ధి పూర్తిగా స్థంభించి పోయిందని పేర్కొంటూ, అనేక సమస్యలను అధికారులతో పట్టుబట్టి పరిష్కరిస్తా నని తెలిపారు.అభివృద్ధి హామీలుసర్పంచ్ అభ్యర్థి మమత రాజు గ్రామ ప్రజలకు కీలక హామీలు అందించారు. అవి మౌలిక వసతులునిలిచిపోయిన సిసి రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు పూర్తి చేయడంఅంగన్వాడి కేంద్రాలు, గ్రంథాలయం, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటుప్రభుత్వం స్థలంలో మినీ ఫంక్షన్ హాల్ / షాదీ ముబారక్ హాల్ నిర్మాణంయువత – క్రీడలు క్రికెట్, వాలీబాల్ కోసం మినీ స్టేడియం నిర్మాణం సామాజిక – ప్రజా సేవప్రతీ అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషిఇల్లు లేని పేదలకు ఇల్లు + ఇంటి స్థలం కల్పనరైతులకు ధాన్యం ఆరబెట్టడానికి ప్రభుత్వ స్థలంలో వేదిక ఏర్పాటు స్వంత ఖర్చులతో మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు నిర్మాణం“చెప్పిన మాట నిలబెడతా… చేయకపోతే శిక్షించండి”తాను అబద్ధాలు చెప్పే నాయకురాలు కాదని, చేసిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు విధించే శిక్షకైనా సిద్ధమని మమత రాజు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో స్వల్పంగా ఓడినప్పటికీ ప్రజా సేవను మాత్రం విస్మరించలేదని చెప్పారు.“గ్రామమే నా దేవాలయం… ప్రజలే నా దేవుళ్లు” అని భావోద్వేగంగా పేర్కొన్నారు. మళ్లీ ఆలోచించి… ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవకాశమివ్వాలని రాంపూర్ ప్రజలను కోరుతూ ప్రచారాన్ని కొనసాగించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular