దుబ్బాక, (మన ప్రజాప్రతినిధి):జనవరి2
దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 40 సంవత్సరాలుగా నిర్విరామంగా విద్యా సేవలు అందించిన ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కోట సక్కు భాయ్–తిరుపతి పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక సీఐ శ్రీనివాస్, భూంపల్లి గ్రామ సర్పంచ్ జన్నారెడ్డి, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. వక్తలు మాట్లాడుతూ, విద్యా ప్రమాణాల అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన పరిపాలన, విద్యార్థుల సర్వాంగ అభివృద్ధి కోసం కోట సక్కు భాయ్–తిరుపతి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె నాయకత్వంలో పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించిందని తెలిపారు.ఈ సందర్భంగా కోట సక్కు భాయ్–తిరుపతి మాట్లాడుతూ, తన ఉపాధ్యాయ జీవితం గర్వకారణమని, విద్యార్థుల విజయాలే తన నిజమైన సంపద అని పేర్కొన్నారు. తన సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమం చివర్లో పాఠశాల సిబ్బంది ఆమెను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు
40 ఏళ్ల అంకిత సేవలకు ఘన వీడ్కోలు
దుబ్బాక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోట సక్కుభాయ్–తిరుపతి పదవి విరమణ
RELATED ARTICLES

