Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఇర్కోడ్ మోడల్ స్కూల్ హాస్టల్‌లో దుప్పట్లు పంపిణీ

ఇర్కోడ్ మోడల్ స్కూల్ హాస్టల్‌లో దుప్పట్లు పంపిణీ

📰 Generate e-Paper Clip

ఇర్కోడ్ మోడల్ స్కూల్ హాస్టల్‌లో దుప్పట్లు పంపిణీ, విద్యార్థుల సౌకర్యానికి ప్రత్యేక కృషి.

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం:జనవరి10

సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినిలకు శీతాకాలం దుప్పట్లు శుక్రవారం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో, మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి నిర్వహించా రు. హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం పూర్తి స్థాయిలో సాగింది.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉప సర్పంచ్ బొప్పిడి రాజవ్వ, గ్రామ పాలకవర్గం వార్డ్ సభ్యులు, మాజీ ఎంపీటీసీ చిట్యాల సత్యనారాయణ గౌడ్, గ్రామ బిఆర్ఎస్ నాయకులు, ప్రిన్సిపాల్ రవీందర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం. విద్యార్థినిలు పాల్గొన్నారు.విద్యార్థులు దుప్పట్లు అందుకొని, శీతాకాలంలో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. మారెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, “టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు అవసరమైన సహకారాన్ని అందించడం ప్రధాన లక్ష్యం. విద్యార్థులు రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి, తల్లిదండ్రులకు గౌరవం తెచ్చేలా చదువుకోవాలని కోరుతున్నాను” అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular