మనప్రజాప్రతినిధి//మిర్యాలగూడ:
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో శుక్రవారం మాడ్గులపల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామములో జిపిఎల్-111 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్ధ ప్రారంబించారు. ఈ సందర్బంగా కొద్ది సేపు బ్యాటింగ్, బౌలింగ్ చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం క్రీడలు మనిషికి మానసిక ధృడత్వాన్ని పెంపోదిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో పాలుట్ల బాబయ్య, మిర్యాల మధుసూదన్, మారుతీ వెంకటరెడ్డి, కర్ర ఇంద్రా రెడ్డి, మోహన్ దాస్, డి నాగరాజు, సిలివేరు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

