మనప్రజాప్రతినిధి//ఖమ్మం:
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఖమ్మంసంక్రాతి పండుగ సందర్బంగా వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నేటి నుండి జనవరి 20 వరకు నగరంలోని కాల్వవోడ్డు మున్నేరు పాత వంతెన పై కార్లు, ఆటోల రాకపోకలకు తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఖమ్మంలో కేవలం బైపాస్ బ్రిడ్జ్ మీద ఎక్కువ ట్రాఫిక్ వెళ్లడం వలన సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కాలవొడ్డు మున్నేరు పాత బ్రిడ్జ్ పైన నుండి ఆటోలు, కార్లు కూడా అనుమతించడం జరుగుతుందని, కావున ప్రజలందరూ గమనించగలరని అన్నారు. కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ కొరకు రెండు వైపులా తవ్వి ఉన్నందున ప్రజలు ఇరుకు మార్గంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించాలని సూచించారు.
కాల్వవోడ్డు మున్నేరు వంతెన పై కార్లు, ఆటోల రాకపోకలకు అనుమతి: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్
RELATED ARTICLES

