•పేదలకు అండగా ప్రభుత్వం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి18
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అధికారుల ద్వారా మంజూరైన చెక్కులను నేరెళ్ల శ్రీకాంత్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతికి అందజేశారు.అత్యవసర వైద్య చికిత్సల కోసం ఖర్చు చేసిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కష్టసమయంలో ప్రభుత్వం తమకు అండగా నిలవడం ఎంతో ఉపశమనం కలిగించిందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నేరెళ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, “అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద కుటుంబాలను ఆదుకోవడమే సీఎం రిలీఫ్ ఫండ్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు చూడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది,”అని అన్నారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయా నికి లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహా స్థానిక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సిరిసిల్ల 13వ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
RELATED ARTICLES

