మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం.దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేట జిల్లా
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో మైనారిటీ అధ్యక్షులు నిజాం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కోసం ₹50,000/- ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ పథకం ద్వారా మైనారిటీ మహిళలు స్వయం ఉపాధి వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ జనవరి 10, 2026 అని స్పష్టం చేశారు.పథకం ప్రయోజనాలు:స్వయం ఉపాధి వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆర్థిక సహాయంఅర్హత ఉన్న ప్రతి మైనారిటీ మహిళకు ₹50,000/- ఒకేసారి మంజూరు.అర్హత ప్రమాణాలు:
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మైనారిటీ మహిళ అయి ఉండాలి
రేషన్ కార్డు కలిగి ఉండాలి.వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.కనీస విద్యార్హత 5వ తరగతి ఉత్తీర్ణత.మైనారిటీ వర్గాలకు చెందినవారు.(ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన్, క్రిస్టియన్)
ప్రాధాన్యత కలిగిన వర్గాలు:విడాకులు తీసుకున్న మహిళలు వితంతువులు.అనాథలు.నిరాశ్రయులు.ఒంటరి / అవివాహిత మహిళలు (45–55 సంవత్సరాల వయస్సు)దరఖాస్తు విధానం:
ఈ పథకానికి అర్హులైన మైనారిటీ మహిళలు తెలంగాణ ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ & మానిటరింగ్ సిస్టమ్ (OBMMS) వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ అధ్యక్షులు నిజాం కోరారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మైనారిటీ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మహిళలకు ₹50,000 స్వయం ఉపాధి ఆర్థిక సహాయం-మైనారిటీ అధ్యక్షుడునిజాం.
RELATED ARTICLES

