•జిల్లాఉద్యమకారుడు మారవేణి రంజిత్ కుమార్ ఘాటు హెచ్చరిక
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి17
రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని జిల్లా ఉద్యమకారుడు మారవేణి రంజిత్ కుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జిల్లా ఏర్పాటుతోనే సిరిసిల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టిందని, ఇప్పుడు జిల్లాను రద్దు చేయడం అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి నుంచి వెనక్కి నెట్టడమేనని ఆయన మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జిల్లాను రద్దు చేసే ప్రయత్నాలు చేస్తే తీవ్ర ప్రజా ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు.జిల్లా రద్దు నిర్ణయం తీసుకుంటే సిరిసిల్ల నడిబొడ్డున కాంగ్రెస్ పార్టీకి 100 గజాల గోతిని తవ్వి పాతేస్తామని తీవ్ర ఆగ్రహం తో వ్యాఖ్యానించారు. సిరిసిల్ల ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని ప్రభుత్వానికి హెచ్చరికలు గుప్పించారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది ఉద్యమాల గడ్డ సిరిసిల్ల అని గుర్తు చేశారు.త్యాగాలకు సిద్ధం – ఉద్యమమే ఊపిరి
గతంలో షాడో ముఖ్యమంత్రి మెడలు వంచి జిల్లా సాధించుకున్న చరిత్ర ఉందని గుర్తు చేశారు. జిల్లాకోసం ఎందరో ఉద్యమకారులు కేసులు ఎదుర్కొని జైలు జీవితం గడిపారని, జిల్లా అస్తిత్వం కోసం మళ్లీ జైలుకు వెళ్లడానికైనా, ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని రంజిత్ కుమార్ స్పష్టం చేశారు.గతంలో జిల్లా ఏర్పాటుకు మద్దతు తెలిపిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పుడు దానిని రద్దు చేసేందుకు కుట్ర పన్నడం శోచనీయమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జిల్లా రద్దు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఉద్యమకారులు సమానపల్లి ప్రశాంత్, అక్కేమ్ నాగరాజు, గొండ్లే తిరుపతి, టేకు మధు, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లజిల్లా రద్దు చేస్తే ఆమరణ నిరాహార దీక్షే తుదిశ్వాస!
RELATED ARTICLES

