Saturday, March 21, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఇంద్రానగర్ హై స్కూల్‌లో విద్యార్థులకు పౌష్టికాహారం

ఇంద్రానగర్ హై స్కూల్‌లో విద్యార్థులకు పౌష్టికాహారం

📰 Generate e-Paper Clip

సిరిసిల్ల భారతి ప్రత్యేక చొరవతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం.
పౌష్టికాహారంతో విద్యార్థుల్లో ఆరోగ్యం, చదువులో ప్రతిభ. •భోజనంనాణ్యతపై తల్లిదండ్రుల సంతృప్తి..
ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్న ఇంద్రానగర్ హై స్కూల్.

మనప్రజాప్రతినిధి//కామారెడ్డి.జనవరి18
కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్ హై స్కూల్‌లో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తూ స్కూల్ చైర్మన్ సిరిసిల్ల భారతి ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజూ శుభ్రతతో కూడిన వాతావరణంలో రుచికరమైన భోజనం అందించడం వల్ల విద్యార్థులు సంతోషంగా భోజనం చేస్తున్నారు.విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడితేనే చదువులో మెరుగైన ప్రతిభ చూపగలరనే ఉద్దేశంతో స్కూల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అన్నం, కూరలు, పప్పు వంటి భోజనాన్ని పోషక విలువలు దృష్టిలో ఉంచుకుని తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు.భోజనం నాణ్యతపై తల్లిదండ్రులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువు రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న సిరిసిల్ల భారతి విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.ఇంద్రానగర్ హై స్కూల్ విధానం ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular