కొండపాకమండలం.మనప్రజాప్రతినిధి//జనవరి1కొండపాక మండలంలోని రాంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ బొమ్మ మల్లయ్య మాట్లాడుతూ, గ్రామంలో రేషన్ షాప్ లేకపోవడంతో గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వచ్చేదని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను గమనించిన తాను రేషన్ డీలర్‌తో మాట్లాడగా, వెంటనే స్పందించిన రేషన్ డీలర్ లాగిశెట్టి అనిల్ ప్రతినెల గ్రామంలోనే రెండు రోజులు అందుబాటులో ఉంటూ రాంపల్లి గ్రామ ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.గ్రామంలోనే రేషన్ బియ్యం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మ మల్లయ్య, ఉప సర్పంచ్ అత్కూరి మాధవి, వార్డు సభ్యులు కిష్టవ్వ, వైకుంఠం, స్వామి, శ్రీనివాస్, యాదగిరి, రేషన్ డీలర్ అనిల్, మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాంపల్లి గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం
0
11

