Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్కార్యకర్తల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యత : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

కార్యకర్తల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యత : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

📰 Generate e-Paper Clip

గుంటూరు,జనవరి7(మనప్రజాప్రతినిధి):
పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వివిధ డివిజన్ల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లోని సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆమె శ్రద్ధగా విని తక్షణ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.కార్యకర్తలే పార్టీకి బలమని, పార్టీ అభివృద్ధికి వారు మూలస్తంభాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. కార్యకర్తల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు కావాలంటేకార్యకర్తల సూచనలు ఎంతో అవసరమని అన్నారు.ప్రజలతో పాటు కార్యకర్తల కు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular