మెదక్//మనప్రజాప్రతినిధి జనవరి 7:
అల్లాదుర్గ్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మెదక్ డిఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ అల్లాదుర్గ్సిఐ రేణుక రెడ్డి ఎస్ ఐ శంకర్ కళాశాల లోని విద్యార్థులను ఉద్దేశించి డిఎస్పి రోడ్డు యాక్సిడెంట్ ల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే సైబర్ క్రైమ్ లో ప్రజలు ఎలా మోసపోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం జరిగినది. ద్విచక్ర వాహనము నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ లేనిదే కారు నడపకూడదని మద్యం సేవించి వాహనములు నడపకూడదని తెలియజేయడం జరిగినది. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వాహనం లకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్తయ్య సార్ కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
RELATED ARTICLES

