Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రజల మధ్యే పండుగ – బిఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల సోమశేఖర్

ప్రజల మధ్యే పండుగ – బిఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల సోమశేఖర్

📰 Generate e-Paper Clip

శ్రీరాఘవేంద్ర నగర్‌లో సంక్రాంతిసంబరాలు-ఇంటింటా స్వీట్ల పంపిణీ
సంక్రాంతిసంతోషాలు ప్రతి ఇంటికి-బిఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ

సదాశివపేట.జనవరి14(మనప్రజాప్రతినిధి)
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సదాశివపేట పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో బిఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటా స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ హాజరై స్వీట్ల పంపిణీని ప్రారంభించారు.ఈ సందర్భంగా చింత గోపాల్ మాట్లాడుతూ…
సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐక్యతతో, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని కోరుతూ కాలనీ వాసులకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.బిఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల సోమశేఖర్ మాట్లాడుతూ…సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలకు, సంస్కృతి కి ప్రతీక అని పేర్కొన్నారు. మహిళలు ఇంటి ముందు వివిధ రకాల ముగ్గులు వేసి, వాటిని రంగులతో దిద్ది, గొబ్బెమ్మలతో అలంకరించడం ద్వారా పండుగ శోభను పెంచుతారని తెలిపారు. అలాగే ప్రతి మహిళ జీవితం కూడా రంగులమయంగా, ఆనందభరితంగా ఉండాలని ఆకాంక్షించారు.పురుషులు గాలిపటాలను ఎగురవేస్తూ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం మన సంప్రదాయమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 8వ వార్డు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాకూరి అశోక్, వెల్చలా అంజయ్య, నాగేష్, విట్టల్, రాఘవేందర్, చారి, శివ, యాదుల్, అజ్జు, శ్రీకాంత్, శరత్, రత్నాకర్ రెడ్డి, కిష్టా గౌడ్, యాకుబ్, గౌస్, బాలరాజ్, గోపాల్ నాయక్, శ్రీను, జగదీష్ గౌడ్, జైపాల్‌తో పాటు 8వ వార్డు పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular