జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
మనప్రజాప్రతినిధి/
రాజన్న సిరిసిల్ల
జనవరి, 06
జిల్లా పోలీసు శాఖలో 26 ఏళ్లుగా విశిష్ట సేవలు అందించిన హోం గార్డ్ దేవయ్య మరణం పోలీసు వ్యవస్థకు తీరని లోటని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని క్రషర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవయ్య ప్రాణాలు కోల్పోయారు.అంత్యక్రియల్లో పాల్గొన్న ఎస్పీమంగళవారం జరిగిన దేవయ్య అంత్యక్రియల్లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
దేవయ్య గత 26 ఏళ్లుగా జిల్లా పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో బాధ్యతాయుతంగా పనిచేశారు.
స్వర్గస్తులైన దేవయ్యకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు, ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
పాల్గొన్న అధికారులుదేవయ్యకు నివాళులర్పించిన వారిలో ఎస్పీతో పాటు డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు నాగేశ్వరరావు, రవి, మొగిలి, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్‌ఐ ఉపేంద్రచారి మరియు ఇతర పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సహచరుడికి కన్నీటి వీడ్కోలు పలికారు.
హోం గార్డ్ దేవయ్య కుటుంబానికి అండగా ఉంటాం
RELATED ARTICLES

