మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి16:
ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శ్రేణులు భారీ సంబరాలతో శక్తి ప్రదర్శన చేశాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంగా మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేస్తూ కార్యకర్తలు విజయోత్సాహాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ, అధికార బలం.డబ్బు బలం మధ్య జరిగిన పోటీలో ప్రజల విశ్వాసం బీజేపీపై నిలిచిందని, ప్రజల ఆశీస్సులతో కరీంనగర్ మేయర్ పదవిని పార్టీ సాధించిందని తెలిపారు. అధికార పార్టీ ఎన్నో ప్రలోభాలకు పాల్పడినప్పటికీ ప్రజలు నిజాయితీ రాజకీయాలకు మద్దతు ఇచ్చారని, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీపై ప్రజల ఆదరణ వేగంగా పెరుగుతోందని అన్నారు.రాబోయే పరిషత్ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా కార్యకర్తలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు బత్తిని సాయ గౌడ్, జిల్లా నాయకులు కొలనూరు ముత్తవ్వ, మాజీ అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్, సీనియర్ నాయకులు మేకల మల్లేశం, దేశెట్టి శ్రీనివాస్, మామిడి హరీష్, సర్పంచ్ గూడెల్లి భాస్కర్, వార్డు సభ్యులు నాయిని శ్రీనివాస్, దూది సుధీర్, భూమల్ల ప్రశాంత్, భూత్ అధ్యక్షులు తుమ్మలపెల్లి కమలాకర్, పిల్లి గోపాల్, బొల్లం రాంసాగర్, పినికాసి అనిల్, కునబోయిన పరశురాములు, శేఖర్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఇల్లంతకుంటలో బీజేపీ శక్తి ప్రదర్శన-కరీంనగర్ విజయంపై ఘన సంబరాలు
RELATED ARTICLES

