Monday, February 23, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

📰 Generate e-Paper Clip

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు
•20రోజుల్లో364 కేసులునమోదు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి23
రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ప్రతి రోజూ విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.డీఎస్పీ మాట్లాడుతూ, సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. గడిచిన 20 రోజుల వ్యవధిలో మొత్తం 364 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకుని, లైసెన్స్ రద్దు కోసం సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేస్తున్నామని తెలిపారు.అదేవిధంగా ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular