Sunday, February 22, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుకాలేశ్వరం కెనాల్ పనులు పూర్తి చేయాలని రైతుల మోకాళ్లపై నిరసన దీక్ష

కాలేశ్వరం కెనాల్ పనులు పూర్తి చేయాలని రైతుల మోకాళ్లపై నిరసన దీక్ష

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.ఫిబ్రవరి22
మనకొండూరు మండలంలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. కాలేశ్వరం 11వ ప్యాకేజ్ ఆర్డీ-3, ఎల్‌ఎం-6 కాల్వ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.గతంలో 19 రోజుల పాటు దీక్షలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి 13 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నా ఎలాంటి చలనం కనిపించడంలేదని తెలిపారు.“మిమ్మల్ని ఓటు వేసి గెలిపించినందుకు మేమే మోకాళ్లపై కూర్చొని శిక్ష వేసుకుంటున్నాం” అంటూ రైతులు మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కాల్వ పనులు పూర్తికాకపోవడంతో సాగునీరు అందక పంటలు నష్టపోతున్నాయని వారు పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో రైతులు కరికె నవీన్ కుమార్, కమటం శ్రీధర్, అక్కి శ్రీనివాస్, ఈర కొమురయ్య, ఎండి కైఫ్, పయ్యావుల రాజమణి, దుమల భారతి, ధూమాల అనిత, ధూమాల సౌజన్య, కడారి రేనా, కమటం సమత, పయ్యావుల లత, రౌతు లచ్చవ్వ, ఈర పద్మ తదితరులు పాల్గొన్నారు.
రైతుల డిమాండ్లపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular