Friday, February 20, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలులింగరాజుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి

లింగరాజుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి

📰 Generate e-Paper Clip

(మనప్రజాప్రతినిధి)ఫిబ్రవరి20
సిద్దిపేట జిల్లా లోని దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని లింగరాజుపల్లి హాస్టల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు.
గోవిందాపూర్ గ్రామానికి చెందిన ఉప్పల అశోక్ (26) రోజువారీగా సూరంపల్లి కోళ్ల ఫారంలో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం అతన్నిఢీకొనడం తో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న ఎస్సై అరుణ్ కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular