•భక్తుల మనసు దోచుకున్న శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం
•మహా కుంభాభిషేకానికి సినీ నటుడు”నందమూరి కళ్యాణ్ రామ్ హాజరు అవుతానన్న ప్రకటన
మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి3.ఏర్పేడుమండలం.
శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం రోజురోజుకూ భక్తుల ఆదరణతో మరింత వైభవంగా వెలుగొందుతోంది.ఇటీవల ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు విశేష స్పందనను పొందుతున్న క్రమంలో ఈరోజు దేవస్థానానికి ప్రముఖ సినీ యాక్టర్ శ్రీ నందమూరి కళ్యాణ్ రామ్విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈరోజు ఉదయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చిన కళ్యాణ్ రామ్.ఆలయచైర్మన్.బత్తలగిరినాయుడు,కార్యనిర్వా హణాధికారి గారు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ పద్ధతిలో తీర్థప్రసాదాలు అందజేసి, స్వామివారి ఆశీర్వాదాలు అందించారు.స్వామివారి దర్శనం అనంతరం కళ్యాణ్ రామ్ గారు ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యం గురించి ఆసక్తిగా మాట్లాడారు. ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను, మనశ్శాంతిని అందించే పవిత్ర క్షేత్రమని కొనియాడారు. త్వరలో జరగనున్న మహా కుంభాభిషేకానికి తప్పకుండా తాను హాజరవు తానని ప్రకటించడం భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.ఇంతకు ముందు కూడా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తుల సహకారం, ప్రజాప్రతినిధుల మద్దతుతోదేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ మరింత ఖ్యాతిని సంతరించుకుంటోంది.

