Sunday, February 22, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుకొండపాకలో ఉచిత బాల హృదయ వైద్య శిబిరం

కొండపాకలో ఉచిత బాల హృదయ వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి22
శ్రీ సత్య సాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలోసిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఫిబ్రవరి 23, 24 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు ఉచిత బాల హృదయ వైద్య పరీక్షా శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో బాలల గుండె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.శిబిరంలో అందించే సేవలు: • బాలల గుండె నిపుణులచే వైద్య పరీక్షలు
• ప్రాథమిక హృదయ పరీక్షలు
• ఎకో పరీక్షలు మరియు అవసరమైన ఇతర పరీక్షలపై మార్గనిర్దేశం
• అవసరమైన చికిత్సపై వైద్యుల సలహాలు
శిబిరానికి రావచ్చిన వారు: • గుండె సమస్యల లక్షణాలు ఉన్న పిల్లలు• పుట్టుకతో గుండె లోపం అనుమానం ఉన్న పిల్లలు
• గుండె శస్త్రచికిత్స లేదా చికిత్సపై సలహా కోరే తల్లిదండ్రులు
ఈ సేవలు జాతి, మత, వర్గ భేదాలు లేకుండా పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.
సందేహాల కోసం సంప్రదించవలసిన నంబర్లు:
ఫోన్: 80101199000
వాట్సాప్: 7075137733
చిన్న హృదయాలను కాపాడుదాం – ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మిద్దాం.”

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular