Tuesday, February 17, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుతెలంగాణ ప్రగతికి మార్గదర్శి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ఘన జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ ప్రగతికి మార్గదర్శి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ఘన జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ -భూంపల్లిమండలం.ఫిబ్రవరి 17
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన గౌరవ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుజన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తరువాత పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ఆయన చేసిన త్యాగాలు, పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, పేదల అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, విద్యుత్, సాగునీటి రంగాలలో చేపట్టిన పథకాలు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేసినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా కృషి చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆయన ప్రజాసేవలో మరింత కాలం ఆరోగ్యంగా కొనసాగుతూ ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular