•సదాశివపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకులతో వేడుకలు – సేవా కార్యక్రమాల నిర్వహణ
సదాశివపేట,ఫిబ్రవరి17(మనప్రజాప్రతినిధి):
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని, భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సదాశివపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శివరాజ్ పాటిల్, చింత సాయినాథ్, చింత గోపాల్ తదితర బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మరియు రాష్ట్ర అభివృద్ధిలో కెసిఆర్ నాయకత్వం చారిత్రాత్మకమని కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో విశేష మార్పు తీసుకొచ్చారని పేర్కొన్నారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కెసిఆర్ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న, కార్యదర్శి వీరేషం, కోడూరు అంజయ్య, చిక్కుల మల్లేశం, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమా న్ని విజయవంతం చేశారు.
కేక్ కట్ చేసి కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
RELATED ARTICLES

