•విద్యార్థుల చేత స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 21 (మన ప్రజా ప్రతినిధి):
సిద్దిపేట అర్బన్ మండలంలోని నాంచారుపల్లి పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, విద్యా అధికారుల పాత్రలను పోషిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా జే. అర్చన, మండల విద్యాధికారిగా ఎం. శివసాయి, జిల్లా విద్యాధికారిగా ఎం.ఇందు వ్యవహరించారు. ఉపాధ్యాయులుగా పి. చందన, ఎస్. శ్రీమాన్య, కే. దీక్ష, జి. సహస్ర, బి. రక్షిత, జె. ఈశ్వర్, బి. బాబు బాధ్యతలు చేపట్టారు.ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు ఈ. సుజాత మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే నిర్మితమవుతుంద ని, ఉపాధ్యాయుల అంకితభావం ద్వారానే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పేర్కొన్నారు.కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు బి. సునీత, ఎన్. అమిత, జనగామ శ్రీనివాస్, ఎస్. స్రవంతి, చేగురి దేవరాజు పర్యవేక్షించారు.స్వయం పరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతా భావంపెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
నాంచారుపల్లి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
RELATED ARTICLES

