మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.ఫిబ్రవరి16 శ్రీకాళహస్తి పట్టణంలో ప్రజలుదర్శనార్థం వచ్చే భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించే ఉద్దేశంతో “ఐ లవ్ శ్రీకాళహస్తి” అనే ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. గతంలో రెండు బ్రిడ్జీలు కలిసే ప్రాంతంలో చెత్తాచెదారాలతో నిర్లక్ష్యంగా ఉన్న స్థలాన్ని పూర్తిగా శుభ్రపరచి, విద్యుత్ అలంకరణలు, పచ్చని గడ్డి ఏర్పాటుతో ఆకర్షణీయంగా పార్క్‌లా అభివృద్ధి చేశారు.ఈ సెల్ఫీ పాయింట్‌ను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయన సతీమణి బొజ్జల రిషితా రెడ్డి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం వారు “ఐ లవ్ శ్రీకాళహస్తి” బోర్డు వద్ద స్వయంగా సెల్ఫీ తీసుకుని పట్టణ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.ఇప్పటి నుంచి దర్శనానికి వచ్చే వేలాది భక్తులు, పట్టణ ప్రజలు ఈప్రాంతంలో సెల్ఫీలు తీసుకుంటూఆనందించేందుకు అనువుగా మారింది. పట్టణ అందాన్ని పెంచే ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోంది.
శ్రీకాళహస్తి గర్వకారణం“ఐ లవ్ శ్రీకాళహస్తి” సెల్ఫీ పాయింట్ ఘన ప్రారంభం
0
4

