Tuesday, February 17, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమహాశివరాత్రి సందర్భంగా “భక్త సిరియాల” పౌరాణిక పద్యనాటకం ఘన విజయం

మహాశివరాత్రి సందర్భంగా “భక్త సిరియాల” పౌరాణిక పద్యనాటకం ఘన విజయం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి17
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర & నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు, సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన వెన్నెల ప్రసన్న నాట్య కళామండలి ఆధ్వర్యంలో, దైవకుమార్ బృందం ద్వారా మహాశివరాత్రి పర్వదినం (15-02-2026) సందర్భంగా శివాలయం ప్రాంగణంలో భక్తి పరవశత నడుమ “భక్త సిరియాల” పౌరాణిక పద్య నాటకం విజయవంతంగా ప్రదర్శించబడింది.
మహాశివరాత్రి సందర్భంగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై భక్తి భావంతో నాటకాన్ని ఆస్వాదించారు.
కథా సారాంశం:
సిరితొండ రాజు తన పట్టణంలో బ్రాహ్మణులకు, ప్రజలకుధర్మకార్యాలు చేస్తూ ఎవరైనా కోరిన దానాన్ని నిరాకరించనని దీక్ష తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో పరమేశ్వరుడు సాధు జంగమయ్య వేషంలో వచ్చి రాజును పరీక్షించాలనుకుంటాడు.జంగమయ్య తనకు కుష్ఠు వ్యాధి ఉందని, అది తగ్గాలంటే రాజు తన కొడుకును ఖండించి వండి పెట్టాలని కోరుతాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ధర్మసంకటంలో రాజు తన కొడుకును త్యాగం చేయడానికి సిద్ధమవుతాడు. చివరికి భగవంతుడు ప్రత్యక్షమై రాజు భక్తిని, వాగ్దాన నిబద్ధతను ప్రశంసించి అనుగ్రహిస్తాడు.ఈ నాటకం ద్వారా భక్తి, త్యాగం, వాగ్దాన పరిరక్షణ వంటి విలువలు ప్రేక్షకులకు హృదయంగమంగా చాటిచెప్పబడాయి.
నటీనటులు:
సిరితొండ రాజు-గోవర్ధన్ =శంకరుడు / జంగమయ్య – దైవకుమార్
బ్రాహ్మణులు – కుమార్, మురళి, ఇంద్రసేన, ఉపపతి, కనకస్వామి
భక్త సిరియాల (బాలుడు) – ఉదయ్‌కుమార్
సుగుణవతి – పరిజన
పార్వతి – దివ్యకుమారి
చెలికత్తెలు – పుష్పాంజలి, శ్రీజ, పూజిత, సుదర్శన
గ్రామ ప్రజల విశేష ఆదరణ మధ్య నాటకం విజయవంతంగా ముగియగా, కళాకారుల ప్రతిభను హాజరైనవారు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular